NEET UG 2026 | ఎల్లుండే నీట్ పరీక్ష.. శనివారం దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్ నిర్వహించనున్న ఎన్టీయే
NEET UG 2026 :ఆదివారం, జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పరీక్షకు ఒక రోజు ముందు.. అంటే శనివారం దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్ నిర్వహించేందుకు సిద్ధమైంది ఎన్టీయే. పరీక్ష ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించనుంది.
NEET UG 2026 : దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహణ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. గత నెలలో జరిగిన పరీక్ష పేపర్ లీకవడం, దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం కావడం, రాజకీయంగా విమర్శలు, కొందరు విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో నీట్ రీ ఎగ్జామ్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈసారి పేపర్ లీక్ కాకుండా పరీక్ష నిర్వహణా సంస్థ అయిన ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. భారత సైనిక విభాగం కూడా పరీక్ష నిర్వహణలో పాలుపంచుకుంటుండటం విశేషం. ఆదివారం, జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగనుంది.
ఈ నేపథ్యంలో పరీక్షకు ఒక రోజు ముందు.. అంటే శనివారం దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్ నిర్వహించేందుకు సిద్ధమైంది ఎన్టీయే. పరీక్ష ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించనుంది. శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు పరీక్షా కేంద్రాల వద్ద మాక్‌డ్రిల్ కొనసాగనుంది. పరీక్ష కోసం సంసిద్ధత, సమన్వయం, భద్రతా చర్యలు, పరీక్ష జరిగే విధానం వంటి అంశాలపై మాక్‌డ్రిల్ ఉంటుంది. దేశవ్యాప్తంగా 5,000కుపైగా పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్న మాక్‌డ్రిల్‌లో 2.5 లక్షల మంది భద్రతా సిబ్బంది పాల్గొనబోతున్నారు. ఇప్పటికే పరీక్షా పత్రాలు, బుక్లెట్స్ అన్నింటినీ కేంద్ర పారామిలిటరీ బలగాలతో వివిధ విభాగాల భద్రతా సిబ్బంది ఆధీనంలో ఉంచారు. పరీక్ష సమయంలో మూడంచెల భద్రత ఉంటుంది. సీసీటీవీ కెమెరాలు, లక్షల మంది భద్రతా సిబ్బంది మధ్య నీట్ పరీక్ష జరగనుంది.
పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఇప్పటికే హాల్ టిక్కెట్లు అందగా, ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా తగిన సూచనలతో సమాచారం అందిస్తోంది ఎన్టీయే. పరీక్షల సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలు, వైద్య విద్యా సంస్థల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. పారదర్శకంగా పరీక్ష నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా టెలిగ్రామ్ యాప్‌ను కేంద్రం ఇప్పటికే నిషేధించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. నీట్ పేపర్ లీకైందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఎన్టీయే సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

