న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ (JEE Main) ఫలితాల విడుదలలో నెలకొన్న గందరగోళంపై జాతీయ పరీక్షల మండలి (NTA) స్పందించింది. సెషన్-2 ఫైనల్ కీని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా జేఈఈ మెయిన్ ఫలితాలను శనివారం (ఏప్రిల్ 19న) వెల్లడించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేసింది.
గురువారం సాయంత్రం 6 గంటలకు జేఈఈ మెయిన్ ఫైనల్ కీని విడుదల చేసిన ఎన్టీఏ.. కొద్దిసేపటికే ఉపసంహరించుకుంది. ఇందుకు కారణాలను వెల్లడించలేదు. రాత్రి 10 దాటినా ఫలితాలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏటీఏ స్పష్టతనిచ్చింది. కాగా, రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలను ఏప్రిల్ 2 నుంచి 9 వరకు ఎన్టీఏ నిర్వహించింది.
గత జనవరి, ఇటీవల జరిగిన రెండు విడతల పరీక్షల్లోని ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు కేటాయిస్తారు. అయితే జేఈఈ-మెయిన్ పరీక్ష సమాధానాల్లో పలు తప్పిదాలు ఉన్నాయని ఫిర్యాదులు వస్తుండటంతో తుది కీ వచ్చే వరకు వేచి ఉండాలని ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. తుది కీలో కూడా తప్పులు ఉండటంతో ఉపసంహరించి ఉంటారని భావిస్తున్నారు.
The Final Answer Keys of JEE (Main) 2025 Session-II will be available for download on the JEE(Main) website by 2 PM today, i.e. on 18th April, 2025.
The result of JEE(Main) 2025 will be declared latest by 19.4.2025.
This is for information to all candidates.
— National Testing Agency (@NTA_Exams) April 18, 2025