JEE Main | న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ ఫలితాల విడుదలలో గందరగోళం నెలకొంది. సెషన్ 2 ఫైనల్ కీని గురువారం విడుదల చేసిన ఎన్టీఏ.. కొద్దిసేపటికే ఉపసంహరించుకుంది. ఇందుకు కారణాలను వెల్లడించలేదు. రాత్రి 10 దాటినా ఫలితాలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలను ఏప్రిల్ 2 నుంచి 9 వరకు ఎన్టీఏ నిర్వహించింది.
గత జనవరి, ఇటీవల జరిగిన రెండు విడతల పరీక్షల్లోని ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు కేటాయిస్తారు. అయితే జేఈఈ-మెయిన్ పరీక్ష సమాధానాల్లో పలు తప్పిదాలు ఉన్నాయని ఫిర్యాదులు వస్తుండటంతో తుది కీ వచ్చే వరకు వేచి ఉండాలని ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. తుది కీలో కూడా తప్పులు ఉండటంతో ఉపసంహరించి ఉంటారని భావిస్తున్నారు.