Mallikarjun Kharge | కాంగ్రెజ్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన న్యాయవాది లీగల్ నోటీసులు పంపారు. విపక్షాల కూటమి ‘ఇండియా’ పదంలో అశోకచక్రాన్ని చూపినందుకు మూడురోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, సరైన జవాబు ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ అవధేష్ తోమర్ పేర్కొన్నారు.
అయితే, ఇటీవల మల్లికార్జున్ ఖర్గే తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెబ్సైట్లో విపక్షాల కూటమి (Indian National Developmental Inclusive Alliance) లోగోను విడుదల చేశారు. ఇండియా పదాల మధ్య అశోక చక్రం ఉన్నది. అయితే, ఏ రాజకీయ పార్టీ జెండాలపై, గుర్తులపై, లోగోలపై ఉండకూడదని న్యాయవాది పేర్కొన్నారు. అశోక చక్రం జాతీయ చిహ్నమన్నారు. ఈ మేరకు ఆయన లీగల్ నోటీసులను పంపారు అవధేశ్ తోమర్. మూడురోజుల్లోగా సమాధానం ఇవ్వకుంటే న్యాయపోరాటం చేస్తామన్నారు.