బెంగళూరు : కర్ణాటక అధికార పార్టీ కాంగ్రెస్లో అంతా సజావుగా లేనట్లు కనిపిస్తున్నది. పూర్తిగా ఐదేండ్ల పదవీ కాలం పూర్తయ్యే వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సిద్ధరామయ్య చెప్పినపుడు ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ బహిరంగంగా సమర్థించారు. కానీ రాష్ర్టానికి సారథ్యం వహించాలనే ఆకాంక్ష ఆయనలో ఇంకా రగులుతూనే ఉంది.
రంభాపురి పీఠాధిపతి శ్రీ రాజదేశికేంద్ర శివాచార్య స్వామీజీ మాట్లాడుతూ, గత శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం డీకే చేసిన కృషి రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. ఆ ఎన్నికల అనంతరం శివ కుమార్ ఉన్నత స్థాయి పదవికి అర్హుడని చెప్పారు. దీనిపై డీకే స్పందిస్తూ, “పార్టీ కార్యకర్తలు, మత పెద్దలు, ప్రజలు నేను సీఎం కావాలని కోరుకుంటున్నారు. అందులో తప్పే ం లేదు” అన్నారు. ఈ అంశం గురించి పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రతిపక్ష నేతలు, మీడియా అనవసరంగా మాట్లాడుతున్నారని అన్నారు.