జమ్ముకశ్మీర్‌లో పేలుళ్లు అందుకేనని కచ్చితంగా చెప్పలేను: జైరామ్ రమేశ్
Jairam Ramesh | రాహుల్‌గాంధీ భద్రత విషయంలో తాము ఏమాత్రం రాజీపడబోమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరామ్ రమేశ్ చెప్పారు. జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుందని తాము ఆశిస్తున్నామన్నారు.
న్యూఢిల్లీ: రాహుల్‌గాంధీ భద్రత విషయంలో తాము ఏమాత్రం రాజీపడబోమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరామ్ రమేశ్ చెప్పారు. జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుందని తాము ఆశిస్తున్నామన్నారు. కశ్మీర్ సర్కారు తమకు ఈ విషయంలో భరోసా ఇస్తే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన జైరామ్ రమేశ్.. బీజేపీకి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయడానికే రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారని చెప్పారు. కశ్మీర్లో పేలుళ్ల వెనుక రాహుల్ పాదయాత్రను ఆపే కుట్ర ఉందంటారా..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆ విషయం తనకు కచ్చితంగా తెలియదని అన్నారు.
అలాంటి కుట్ర ఏమైనా ఉంటే భద్రతా ఏజన్సీలే సమాచారం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. అయితే, ఎవరు ఏ కుట్ర చేసినా రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రను ఆపలేరని మాత్రం తాను కచ్చితంగా చెప్పగలనన్నారు. కాగా, రాహుల్ భారత్ జోడో యాత్ర తమిళనాడులో మొదలై వివిధ రాష్ట్రాల మీదుగా ఇప్పుడు కశ్మీర్‌కు చేరింది.
కశ్మీర్‌లోనే రాహుల్‌గాంధీ తన పాదయాత్రకు ముగింపు పలకనున్నారు. అయితే రాహుల్ యాత్ర కశ్మీర్లో ప్రవేశించిన రెండు రోజులకే నర్వాల్ ప్రాంతంలో రెండు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లలో మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ భద్రతపై కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

