భోపాల్: బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి (Uma Bharti) సొంత పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో ప్రారంభించిన జన ఆశీర్వాద్ యాత్రకు తనను పిలువకపోవడంపై మండిపడ్డారు. ఒకవేళ తనకు ఆహ్వానం అందినప్పటికీ ఆ యాత్రలో పాల్గొనబోనని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు చేరువయ్యేందుకు జన ఆశీర్వాద్ యాత్రను బీజేపీ చేపట్టింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 30 స్థానాలకుగాను 24 సీట్లు బీజేపీ గెలిచిన వింధ్యా ప్రాంతం మీదుగా ఈ యాత్ర సాగనున్నది.
కాగా, మధ్యప్రదేశ్ మాజీ సీఎం అయిన ఉమాభారతిని జన ఆశీర్వాద్ యాత్ర ప్రారంభ కార్యక్రమానికి పిలువలేదు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ బీజేపీపై ఆమె మండిపడ్డారు. తాను యాత్రలో ఉంటే ప్రజలందరి దృష్టి తనపైనే ఉంటుందని, అందుకే బీజేపీ నేతలంతా భయపడి ఉంటారని ఎద్దేవా చేశారు. అలాగే సోషల్ మీడియా ద్వారా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ‘జన ఆశీర్వాద యాత్రకు నాకు ఆహ్వానం అందలేదన్నది నిజమే. అయితే, నాకు ఆహ్వానం అందినా, అందకపోయినా నేను తక్కువ కాదు. ఇప్పుడు ఆహ్వానించినా వెళ్లబోను. సెప్టెంబరు 25న జరిగే యాత్ర ముగింపు వేడుకకు కూడా నేను హాజరుకాను’ అని ఎక్స్‌లో హిందీలో ట్వీట్ చేశారు.
1) कल दिनांक 3 सितंबर 2023 की तीन बाते बहुत चर्चा में आ गई थी ।
2) उम्मीदवारों की सूची, जिसपर मैंने कल रात को ही ट्वीट कर वस्तुस्थिति बता दी ।
— Uma Bharti (@umasribharti) September 4, 2023