పాట్నా: రాజకీయ చదరంగంలో తాను మోసపోయానని బీహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ నేత శ్యామ్ రజక్ (Shyam Rajak) తెలిపారు. అందుకే పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ప్రముఖ దళిత నాయకుడైన ఆయన తన ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకున్నట్లు ప్రకటించారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ‘నాకు చదరంగం ఆట అంటే ఇష్టం లేదు, అందుకే మోసపోయా. మీరు మీ ఎత్తుగడలను ప్లాన్ చేస్తూనే ఉన్నారు. నాతో సంబంధాన్ని నేను చూస్తునే ఉన్నా’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను అందులో పోస్ట్ చేశారు.
కాగా, 2020లో సీఎం నితీష్ కుమార్‌కు చెందిన జనతాదళ్ (యునైటెడ్)ని వీడిన శ్యామ్ రజక్, లాలూ యాదవ్ పార్టీలో చేరారు. నాలుగేళ్ల తర్వాత ఆర్జేడీకి రాజీనామా చేశారు. అయితే మరే పార్టీలో చేరే విషయమై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మీడియాతో ఆయన అన్నారు.
#WATCH | Patna, Bihar: On his resignation from RJD, Shyam Rajak says, "…I was in the RJD and the people of the party were playing games. That is why I wrote (in my resignation) in the letter that they were playing games while I was carrying on the relations…I don't know… pic.twitter.com/YSv1dfWEiK
— ANI (@ANI) August 22, 2024