న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో టాప్ 100లో ఒక్క భారత యూనివర్సిటీకి కూడా చోటు దక్కలేదు. టాప్-200లో కేవలం మూడు యూనివర్సిటీలు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. ఐఐటీ ఢిల్లీ 118వ ర్యాంకు, ఐఐటీ బాంబే 134వ ర్యాంకు, ఐఐటీ మద్రాస్ 170వ ర్యాంకులో నిలిచాయి. ఢిల్లీ యూనివర్సిటీ గత ఏడాది కంటే ఐదు స్థానాలు ఎగబాకింది. ఇండియాలో టాప్ ర్యాంకును సొంతం చేసుకుంది.
కానీ మన దేశం నుంచి మూడు యూనివర్సిటీలే ఉండటం విద్యావ్యవస్థ తీరుపై ఆందోళన కలిగిస్తున్నదని విద్యా నిపుణులు అంటున్నారు. ఇక వరుసగా 15వ సంవత్సరం కూడా యూఎస్‌లోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నంబర్ వన్ ర్యాంకును సాధించింది. బ్రిటన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్ 2వ ర్యాంకు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ 3వ ర్యాంకు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ 4వ ర్యాంకు, హార్వర్డ్ యూనివర్సిటీ 5వ స్థానాల్లో నిలిచాయి.