KC Tyagi : లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) అవకతవకలు జరిగాయని, ఈవీఎంల (EVMs) ను ట్యాంపరింగ్ చేశారని వస్తున్న ఆరోపణలపై.. ఎన్డీఏ (NDA) కూటమిలోని మిత్రపక్ష పార్టీ జేడీయూ (JDU) కు చెందిన సీనియర్ నేత కేసీ త్యాగి (KC Tyagi) స్పందించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున ఎవరు కూడా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయలేదని, ఇప్పుడు ఎలాన్ మస్క్ (Elon Musk) సోషల్ మీడియాలో పోస్టు చేసిన తర్వాత అందరూ ఆరోపణలు చేస్తున్నారని త్యాగి విమర్శించారు.
అయినా ఆదివారం కేంద్రం ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టి చేసిన ప్రకటనతో ఆ అనవసరపు చర్చ ముగిసిపోవాలని కేసీ త్యాగి అన్నారు. అదేవిధంగా లోక్సభ స్పీకర్ ఎన్నిక అంశంపై కూడా త్యాగి స్పందించారు. ‘ఆదివారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్డీఏ పక్షాలతో సమావేశమై స్పీకర్ ఎంపికపై చర్చించారు. మేమ మా అభిప్రాయాలు వెల్లడించాం. జేడీయూ ఏ పదవికి పోటీలో లేదు. బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థికే మేం మద్దతిస్తాం’ అని త్యాగి చెప్పారు.