జమ్ము: కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ఇకపై ఎవ్వరూ ఆపలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం జమ్ముకశ్మీర్‌కు వచ్చిన ఆయన ఇవాళ ఐఐటీ-జమ్ము నూతన క్యాంపస్‌ను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రేమ్‌నాథ్ డోగ్రా జయంతి గురించి ప్రస్తావించారు. దేశ ప్రజలు ఆయనను ఎప్పటికీ మరిచిపోరన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జితో కలిసి ప్రేమనాథ్ డోగ్రా.. టూ విధాన్, టూ నిషాన్, టూ ప్రధాన్ దేశంలో ఎప్పటికీ వర్కవుట్ కావనే నినాదం ఇచ్చారు.
జమ్ముకశ్మీర్ ప్రజలకు అన్యాయం ఇక అన్యాయం జరుగబోదని, ఇక నుంచి వారికి ఎవరూ అన్యాయం చేయలేరని అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి ఊపందుకుందని చెప్పారు. అయితే కొంతమంది ఆ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రయత్నాలను సాగనివ్వమని షా హామీ ఇచ్చారు. జమ్ముకశ్మీర్ వైష్ణోదేవి, ప్రేమ్‌నాథ్ డోగ్రా లాంటి ప్రసిద్ధ ఆలయాలున్న భూమి అని, శ్యామప్రసాద్ ముఖర్జి లాంటి మహనీయుడిని త్యాగం చేసిన నేల అని షా పేర్కొన్నారు.
#WATCH | Jammu: HM Amit Shah says, "…Nobody can stop the era of development that has started in J&K. It's the land of temples, of Mata Vaishno Devi, of Prem Nath Dogra, the land of sacrifice of Syama Prasad Mukherjee. We won't let the people of disrupt the peace in J&K,succeed" pic.twitter.com/b5GcakuRPe
— ANI (@ANI) October 24, 2021