పయాగ్రాజ్, ఫిబ్రవరి 11: మాఘ పూర్ణిమను పురస్కరించుకుని బుధవారం భారీ స్థాయిలో మహా కుంభమేళాను సందర్శించే ప్రజలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయాగ్రాజ్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించింది. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మహా కుంభమేళాకు వెళ్లే దారులన్నీ 300 కిలోమీటర్ల దూరం వరకు వాహనాలతో కిక్కిరిసిపోయాయి.
మాఘ పూర్ణిమ మంగళవారం సాయంత్రం 6.55 గంటలకు ప్రారంభమై బుధవారం రాత్రి 7.22 గంటలకు ముగుస్తుంది. మంగళవారం తెల్లవారుజాము 4 నుంచి మేళా ప్రాంతాన్ని ‘నో వెహికిల్ జోన్’గా అధికారులు ప్రకటించారు. అత్యవసర, నిత్యావసర సర్వీసులకు చెందిన వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.