గువాహటి: ప్రభుత్వ పాఠశాలల్లో (Govt schools) పనిచేసే ఉపాధ్యాయులకు అస్సాం (Assam) ప్రభుత్వం డ్రెస్ కోడ్ (Dress code) తప్పనిసరి చేసింది. పాఠశాలలో టీచర్లు (Teachers) టీ షర్ట్స్ (T-shirts), జీన్స్ (Jeans), లెగ్గింగ్స్ (Leggings) వేసుకోవడాన్ని నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని, వారి వస్త్రధారణ కూడా ఆ మేరకు హుందాగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందువల్ల డ్రెస్‌కోడ్‌ను తప్పని సరిగా పాటించాలని విద్యాశాఖ వెల్లడించింది. తమ విధులు నిర్వర్తించే సమయంలో మర్యాదకరమైన డ్రెస్సింగ్ ఉండాలని తెలిపింది.
కొందరు టీచర్లు తమకు నచ్చిన దుస్తుల్లో పాఠశాలలకు వస్తున్నారని, కొన్నిసార్లు అది ఆమోదయోగ్యంగా అనిపించదని తెలిపింది. స్కూళ్లో విధులు నిర్వహించే సమయంలో ప్రొఫెషనలిజం కనబడేట్లు డ్రెస్సింగ్ ఉండాలని పేర్కొంది. క్యాజువల్స్, పార్టీ వేర్ దుస్తులకు దూరండాలని సూచింది. ఇకపై పురుష ఉపాధ్యాయులు ఫార్మల్ షర్ట్, ప్యాంట్, మహిళా ఉపాధ్యాయులు సల్వార్ సూట్ లేదా చీర వంటి ఫార్మల్ దుస్తుల్లో మాత్రమే ధరించాలని ఆదేశించింది. ఒకవేళ డ్రెస్ కోడ్ పాటించకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ పేర్కొంది.