న్యూఢిల్లీ: రైతులకు పూర్తిగా రుణ మాఫీ చేయాలన్న ప్రతిపాదనేదీ తమ ప్రభుత్వ పరిగణనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్లో తెలిపారు. అయితే రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకున్నదని తెలిపారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్లు, రాయితీ వడ్డీతో రూ.3 లక్షల వరకు పంట రుణం, పీఎం కిసాన్ నిధి ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నామని ఆమె ప్రస్తావించారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం రైతులకు తగిన రుణాలు అందేలా మార్కెట్లో, బ్యాంకుల్లో నిధులను ఉంచుతున్నామని.. ఈ విషయం గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆమె చెప్పారు.