Supreme Court | కర్ణాటకలో ముస్లిం కోటాపై రాజకీయ ప్రకటనలు వద్దు: సుప్రీంకోర్టు
Supreme Court | ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కోటా రద్దు అంశంపై కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ ప్రకటనలు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ కోటా రద్దు అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దానిపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించింది.
బెంగళూరు: ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కోటా రద్దు అంశంపై కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ ప్రకటనలు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ కోటా రద్దు అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దానిపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించింది. అనంతరం కేసు విచారణను జూలై నెలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
అంతకుముందు.. న్యాయ పరిధిలో ఉన్న అంశాలపై బహిరంగ ప్రకటనలు చేయరాదని, వాటికి రాజకీయాలతో సంబంధం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ముస్లిం రిజర్వేషన్ కోటా రద్దు అంశాన్ని పలుమార్లు ప్రస్తావించారు. దీనిపై కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. ముస్లింలకు తమ పార్టీ రిజర్వేషన్లు ఉపసంహరించుకున్నట్లు అమిత్ షా గర్వంగా చెబుతున్నారన్నారు.
కేంద్ర తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, అదే విషయాన్ని కేంద్ర హోంమంత్రి ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారని అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సొలిసిటర్ జనరల్‌గా, న్యాయవాదిగా మీరు వాదించవచ్చని, కానీ బహిరంగ ప్రదేశంలో మరొకరు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

