PM Modi | న్యూఢిల్లీ: ప్రధాని మోదీ చదివిన డిగ్రీకి సంబంధించిన రికార్డులను న్యాయస్థానానికి చూపిస్తామని ఢిల్లీ హైకోర్టుకు గురువారం ఢిల్లీ విశ్వవిద్యాలయం తెలిపింది. ఆ రికార్డులను ఇతరులకు చూపించబోమని చెప్పింది. దీంతో తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది.
నీరజ్ అనే వ్యక్తి ఆర్టీఐ చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తుపై కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) 2016 డిసెంబరులో తీర్పు చెప్తూ, 1978లో బీఏ ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులందరి రికార్డులను పరిశీలించేందుకు అవకాశం ఇవ్వాలని డీయూను ఆదేశించింది. ఈ ఆదేశాలను డీయూ హైకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు 2017 జనవరిలో సీఐసీ ఆదేశాలను నిలుపుదల చేసింది.