Suvendu Adhikari | కోల్కతా, జూలై 17: ప్రధాని మోదీ ఇచ్చిన ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదం’పై బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక బెంగాల్లో ఆ నినాదం అవసరం లేదని అన్నారు. మైనారిటీ వర్గం మద్దతు ఇవ్వకపోవడం వల్లే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఓడిందని సువేందు అధికారి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అవసరం లేదని, దాని స్థానంలో హమ్ ఉన్కే సాథ్ జో హమారీ సాథ్ (మాతో ఉన్న వారితో మేమున్నాం) పెట్టాలని సూచించారు.
కొత్త క్రిమినల్ చట్టాలపై మమత ప్రభుత్వం సమీక్ష
కోల్కతా: ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలను సమీక్షించేందుకు ఏడుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మూడు నెలల్లోగా ఈ కమిటీ నివేదికను సమర్పించవలసి ఉంటుంది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ జారీ అయ్యింది. కాగా, ఈ కమిటీ లక్ష్యాలేమిటో వివరించాలని మమత బెనర్జీని గవర్నర్ సీవీ ఆనంద బోస్ కోరారు.