న్యూఢిల్లీ: దేశంలో పలు చోట్ల చోటుచేసుకున్న గుండెపోటు, ఇతర హృద్రోగ సంబంధ మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌కు ఎలాంటి సంబంధం లేదని కేంద్రం బుధవారం స్పష్టం చేసింది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో 20 మంది గుండె సంబంధ సమస్యలతో మరణించడానికి కొవిడ్ వ్యాక్సినే కారణమంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన క్రమంలో కేంద్రం వివరణ ఇచ్చింది.
విస్తృతమైన పరిశోధనలు చేసిన తర్వాత కరోనా వ్యాక్సిన్‌కు, గుండెపోటు మరణాలకు ఎలాంటి సంబంధం లేదని ఐసీఎంఆర్, ఏఐఐఎంఎస్ నిర్ధారించాయని తెలిపింది.