న్యూఢిల్లీ: ఈ సంవత్సరం టైమ్ మ్యాగజైన్ ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారతీయులెవరికీ చోటు దక్కలేదు. నిరుటి జాబితాతో పోలిస్తే ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. తాజా జాబితాను నాయకులు, ఆదర్శవంతులు, మేధావులు వంటి విభాగాలుగా వర్గీకరించారు.
నాయకుల విభాగంలో భారత సంతతికి చెందిన రేష్మా కెవల్మ్రణికి చోటు దక్కింది. ఆమె అమెరికాలో పెద్ద బయో సాంకేతిక సంస్థల్లో ఒకటైన వర్టెక్స్ ఫార్మాసూటికల్స్కు మొదటి మహిళా సీఈవోగా సేవలందిస్తున్నారు. నాయకుల క్యాటగిరీలో స్థానం పొందిన ప్రముఖుల్లో అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి ముహమ్మద్ యూనస్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఉన్నారు.