ఇండోర్ : ‘నో హెల్మెట్.. నో పెట్రోల్’ విధానం మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అమల్లోకి రాబోతున్నది. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులను పెట్రోల్ పంపుల్లో ఇంధనాన్ని రీఫిల్ చేసుకోకుండా నిరాకరించటమే ‘నో హెల్మెట్.. నో పెట్రోల్’ విధానం. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అభయ్ మనోహర్ కమిటీ మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొస్తూ, ఇండోర్ జిల్లా కలెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
నిబంధనలు పాటించని పెట్రోల్ పంపులపై ఇండియన్ సివిల్ సెక్యూరిటీ కోడ్-2023 ప్రకారం, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ విధానం అమలు జేయకపోతే రూ.5 వేలు జరిమానా, ఏడాది జైలు విధిస్తామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.