‘రాత పూర్వక అనుమతి లేకుండా… మహిళలు ఆ వేళల్లో పని చేయకూడదు’
లక్నో: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టిని సారించింది. ఇందులో భాగంగా శనివారం కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. రాత పూర్వక అనుమతి లేనిదే ఉదయం ఆరు గంటలలోపు, సాయంత్రం 7 గంటల తర్వాత మహిళలు పని చేయకూడదని పేర్కొంది. ఒకవేళ ఆయా వేళల్లో మహిళలు పని చేస్తే వారికి ఉచితంగా రవాణా, ఆహారం, తగిన పర్యవేక్షణ కల్పించాలని సంస్థలను ఆదేశించింది. అలాగే రాత్రి షిఫ్టులో పని చేసే మహిళా కార్మికులు ఏదైనా అవాంఛనీయ సంఘటనలను ఎదుర్కొంటే ఆయా ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్కు, స్థానిక పోలీస్ స్టేషన్కు కూడా ఎక్స్ప్రెస్ రిపోర్ట్ పంపాలని కోరింది.
మరోవైపు మహిళలకు భద్రత, సురక్షిత పని వాతావరణం కల్పించేలా ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి మహిళల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలని యూపీ ప్రభుత్వం తెలిపింది. లైంగిక వేధింపులను నిరోధించేందుకు యాజమాన్యాలు తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. దీని కోసం విధిగా ఫిర్యాదు వ్యవస్థను నిర్వహించాలని ఆదేశించింది. ఈ అంశంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా వెంటనే ఆ కంపెనీ లేదా సంస్థను మూసివేస్తామని హెచ్చరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

