 
                                                            జైపూర్: రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దియా కుమారి ఆ రాష్ట్రంలో గత ఐదేళ్ల కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. గడిచిన ఐదేళ్లలో రాజస్థాన్లో ఏ ఒక్క అభివృద్ధి పని జరగలేదని ఆమె విమర్శించారు. పైగా మహిళలపై నేరాలు పెరిగిపోయాయని, శాంతిభద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిందని అన్నారు. ప్రస్తుతం రాజస్థాన్ పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం తామంతా కలిసికట్టుగా పనిచేస్తామని, మా ముఖ్యమంత్రి మార్గదర్శనంలో మేం ముందుకు వెళ్తుంటామని దియా కుమారి చెప్పారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. రాజస్థాన్ ప్రజలు బీజేపీ మీద, ప్రధాని నరేంద్రమోదీ మీద తమ విశ్వాసాన్ని మరోసారి చాటుకున్నారని, అది తమ బాధ్యతలను మరింత పెంచిందని ఆమె వ్యాఖ్యానించారు. ఆ బాధ్యతలను భుజానికి ఎత్తుకుని పనిచేయడానికి తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. కాగా, దియా కుమారి ఇవాళే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
#WATCH | Jaipur | Rajasthan Deputy CM Diya Kumari says, “No development happened in Rajasthan for 5 years, no work was done here. Crimes against women increased, law and order collapsed, state’s financial condition was poor – everyone knows the condition of Rajasthan. All of us… pic.twitter.com/NKVbtG0B1d
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 15, 2023
 
                            