Samantha – Raj | బాలీవుడ్ దర్శక నిర్మాత రాజ్ నిడిమోరుతో ఏడాదిన్నరగా వినిపిస్తున్న డేటింగ్ రూమర్స్‌కు ముగింపు పలుకుతూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత డిసెంబర్ 1న అధికారికంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో ఆధ్యాత్మిక వాతావరణంలో అగ్నిసాక్షిగా జరిగిన ఈ వివాహం సినీ ప్రపంచంలోనే కాదు, సామాన్య ప్రేక్షకుల్లోనూ పెద్ద చర్చకు దారి తీసింది. సింపుల్‌గా, సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పెళ్లికి చాలా పరిమిత సంఖ్యలో అతిథులను మాత్రమే ఆహ్వానించగా, బయటకు వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
వివాహం అనంతరం సమంత తొలిసారి భర్త రాజ్‌తో కలిసి అత్తింటికి వెళ్లగా ఆ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక సమంత–రాజ్ పెళ్లి జరిగిన ప్రదేశం కూడా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. సమంత క్రిస్టియన్ అయినప్పటికీ, లింగ భైరవి దేవత పట్ల ఆమెకు ఉన్న ఆధ్యాత్మిక నమ్మకం కారణంగానే వివాహాన్ని ఈషా యోగా సెంటర్లో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. గతంలో తన కష్టకాలంలో సమంత తరచూ లింగ భైరవి ఆలయాన్ని సందర్శించడం, ధ్యానం చేయడం, ఆ దైవ అనుభూతి తనకు ధైర్యం ఇచ్చిందని ఆమె పలు సందర్భాల్లో వెల్లడించింది. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆధ్యాత్మిక శక్తికి సాక్షిగా ప్రారంభించాలన్న భావనతోనే ఈషాలో పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది.
ఇక పెళ్లి తర్వాత సమంత తన భర్త రాజ్‌తో కలిసి జాలీగా గడుపుతుంది. రీసెంట్గా హైదరాబాద్‌లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి హాజరైన సమంత చీరకట్టులో సందడి చేసింది. ఆ సమయంలో కొందరు అభిమానులు కాస్త అత్యుత్సాహంతో సమంతని ఇబ్బంది పెట్టారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే సినిమా షూటింగ్ నిమిత్తం సమంత ముంబైకి వెళ్లగా ఎయిర్ పోర్ట్‌లో సమంతని రాజ్ పికప్ చేసుకోగా, అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ సమయంలో సమంత చాలా జాలీగా కనిపిస్తుంది.
#RajNidimoru at Mumbai Airport to pick up his wife #Samantha 📸 #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/0jTOe0svHj
— Telugu FilmNagar (@telugufilmnagar) December 22, 2025