Actor Shivaji | హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై శివాజీ సంచలన వ్యాఖ్యలు.. తిట్టిపోస్తున్న నెటిజన్స్
Actor Shivaji | హీరోయిన్ల అందం చీరలోనే, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుందని హీరో శివాజీ వ్యాఖ్యానించారు. ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Actor Shivaji | హీరోయిన్ల అందం చీరలోనే, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుందని హీరో శివాజీ వ్యాఖ్యానించారు. ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఈ ఈవెంట్లో మాట్లాడిన శివాజీ, యాంకర్ డ్రెస్సింగ్ సెన్స్ బాగుందని ప్రశంసించారు. అనంతరం హీరోయిన్ల వేషధారణపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “హీరోయిన్లు ఏ బట్టలు పడితే అవి వేసుకుని వస్తే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోవద్దు. అనుకున్నా పోయేదేం లేదు. అందం చీరలో, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది.
సామాన్లు కనిపించే బట్టల్లో ఏమీ ఉండదు. అవి వేసుకున్నప్పుడు చాలా మంది చూసి నవ్వుతారు. లోపల మాత్రం ‘ఇలాంటి బట్టలెందుకు వేసుకుంది, కాస్త మంచివి వేసుకుంటే ఎంత బాగుంటుంది’ అనిపిస్తుంది. కానీ అనలేం” అని వ్యాఖ్యానించారు. అలాగే స్త్రీ స్వేచ్ఛ అంశాన్ని ప్రస్తావిస్తూ, “ఇలా మాట్లాడితే వెంటనే స్త్రీ స్వాతంత్య్రం, స్వేచ్ఛ అంటారు. స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. మా అమ్మ ఎప్పటికీ చక్కగా, గౌరవంగా కనిపిస్తారు. ఓ సావిత్రి, ఓ సౌందర్య లాంటి వారు అందుకే గుర్తుండిపోయారు. ఈ జనరేషన్లో రష్మిక లాంటి అమ్మాయిలు కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. గ్లామర్ ఓ దశ వరకే ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం, దాన్ని కోల్పోవద్దు. మన వేషం, భాష నుంచే మన గౌరవం పెరుగుతుంది. ప్రపంచ వేదికలపై కూడా చీర కట్టుకున్న వారికే విశ్వసుందరి కిరీటాలు వచ్చాయి” అంటూ శివాజీ అన్నారు.
ఈ వ్యాఖ్యలపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు శివాజీ మాటలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ‘సామాన్లు’, ‘దరిద్రపు’ వంటి బూతు పదాలు ఉపయోగించడం సరికాదని, హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై అభిప్రాయం చెప్పాలంటే మర్యాదగా చెప్పొచ్చని నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక శివాజీ, బిందు మాధవి, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన సోషల్ ఓరియెంటెడ్ మూవీ ‘దండోరా’. మురళీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘కలర్ ఫోటో’, ‘బెదురులంక 2012’ వంటి సినిమాలు నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ నిర్మించారు. సమాజంలో ఉన్న అసమానతలు, కులం వంటి సున్నితమైన అంశాలను స్పృశిస్తూ తెరకెక్కిన ఈ మూవీకి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మంచి హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న ‘దండోరా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Heroines eey Battalu Padithe Aa Battalu Esukokandi. Cheeralone Andham, Gouravam Vundhi. Samanlu Kanipinche battalo kaadhu
– #Sivaji at #Dhandoraa Pre Release
pic.twitter.com/ACriYpvhxd— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) December 22, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP news | అర్నబ్ తుపానుతో అతలాకుతలం.. ఏపీలో నేడూ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
Osmania University | ఓయూలో పెన్‌డౌన్.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
Janhvi Kapoor | ‘పెద్ది’ వివాదంపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అది నా తప్పే అంటూ కామెంట్
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో ముఖేష్-వర్షిణి ముద్దు ఫొటో కలకలం.. ఝాన్సీకి వార్నింగ్, రోహిత్ ఫైర్!
Malkajgiri Municipal Corporation | ఆయన చెప్పిందే వేదం.. నచ్చిన వారికే పోస్టింగ్‌లు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

