Battle Of Galwan | సల్మాన్ ఖాన్ కంబ్యాక్‌పై అంచనాలు ..‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టీజర్ రిలీజ్‌కి టైం ఫిక్స్
Battle Of Galwan | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. ఇటీవల తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘సికందర్’ భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
Battle Of Galwan | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. ఇటీవల తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘సికందర్’ భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో సల్మాన్ కంబ్యాక్ కోసం ఆయన అభిమానులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఓకే చేసిన కొత్త సినిమా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ (Battle Of Galwan)’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను దర్శకుడు అపూర్వ లఖియా తెరకెక్కిస్తున్నారు.
మిలిటరీ వార్ డ్రామా కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో చిత్రాంగద సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 50 శాతం పూర్తైనట్లు సమాచారం. అంతకుముందే విడుదలైన సల్మాన్ ఖాన్ లుక్కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ మూవీ టీజర్‌కు సంబంధించిన క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, ఈ మూవీ టీజర్‌ను డిసెంబర్ 27న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో సల్మాన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై ఇంకా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక కథ విషయానికి వస్తే, 2020లో భారత్–చైనా సరిహద్దులో జరిగిన గల్వాన్ లోయ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ తెలంగాణ వీర సైనికుడు, గల్వాన్ వీరుడు కల్నల్ సంతోష్ బాబు పాత్రలో కనిపించబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇది కూడా ఇప్పటివరకు రూమర్‌గానే ఉంది. ఈ కీలక అంశంపై కూడా మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, ఈ సినిమాకు సౌత్ నుంచి, ముఖ్యంగా టాలీవుడ్ నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ సల్మాన్ ఖాన్ కెరీర్లో బలమైన కంబ్యాక్‌గా నిలుస్తుందా? అన్నది రానున్న రోజుల్లో మరిన్ని అప్డేట్స్తో స్పష్టమవనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto Immune Diseases | మహిళల్లో అధికమవుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధుల సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి..
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్‌వుడ్‌కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

