Beard | అబ్బాయిలు గడ్డంతో బాగుంటారా? గడ్డం లేకుండా క్లీన్ షేవ్‌తో అందంగా కనిపిస్తారా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న! అబ్బాయిలు గడ్డం పెంచుకుంటేనే అందంగా ఉంటారని చాలామంది అమ్మాయిలు చెబుతుంటారు. కానీ క్లీన్ షేవ్‌తో ఉండే అబ్బాయిలను ఇష్టపడే అమ్మాయిలు కూడా లేకపోలేదు!! దీనికి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ అమ్మాయిలే నిదర్శనం.. తమకు గడ్డంతో ఉన్న అబ్బాయిలు ఏ మాత్రం వద్దని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
ఇండోర్‌లో కొంతమంది అమ్మాయిలు కృత్రిమ గడ్డం పెట్టుకుని.. ప్లకార్డులు పట్టుకుని రోడ్లపైకి వచ్చారు. గడ్డం గీసుకునే అబ్బాయిలే కావాలంటూ నిరసన తెలిపారు. నో క్లీన్ షేవ్.. నో లవ్.. బియర్డ్ హటావో గర్ల్‌ఫ్రెండ్ భూల్జావో ( గడ్డాన్ని వదులుకో.. లేదా గర్ల్‌ఫ్రెండ్‌ను వదులుకో), బియర్డ్ హటావో ప్యార్ బచావో( గడ్డం తీసేయండి.. ప్రేమను కాపాడుకోండి) అంటూ నినాదాలతో అమ్మాయిలు ఫ్లకార్డులు పట్టుకుని ఇండోర్ వీధుల్లో ర్యాలీ తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
“‘Shave your beard, fall in love!’ 💔 An unusual protest by college girls in Indore leaves many shocked as they voice their concerns with a quirky slogan! #Indore #Protest #CollegeGirls #Viral #Beard #BeardHataoProtest pic.twitter.com/egmJqnPxWV
— The Munsif Daily (@munsifdigital) October 19, 2024