న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశం (All Party Meet) ఏర్పాటు చేసింది. అయితే అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎంతో సహా పలు ప్రాంతీయ, జాతీయ పార్టీలను మినహాయించింది. లోక్‌సభ లేదా రాజ్యసభలో కనీసం ఐదుగురు పార్లమెంటు సభ్యులున్న పార్టీలకు మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానించారు.
కాగా, పహల్గామ్ ఉగ్రదాడిపై నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి ఇలాంటి పరిమితి, షరతు విధించడంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఈ నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. ‘ఇది బీజేపీ లేదా మరో పార్టీ అంతర్గత సమావేశం కాదు. తీవ్రవాదం, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలపై బలమైన, ఐక్య సందేశాన్ని పంపే అఖిలపక్ష సమావేశం’ అని ఆయన అన్నారు.
మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కూడా సొంతంగా బలం లేదని అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు. ఒక ఎంపీ ఉన్న పార్టీ లేదా వంద మంది ఎంపీలున్న పార్టీ అయినా భారతీయులు ఎన్నుకున్న వారేనని తెలిపారు. ఇంత ముఖ్యమైన విషయంపై వినడానికి చిన్న పార్టీలు కూడా అర్హులేనని చెప్పారు. ‘ఇది రాజకీయ సమస్య కాదు. జాతీయ సమస్య. ప్రతి ఒక్కరూ వినాలి. ఇది నిజమైన అఖిలపక్ష సమావేశం కావాలని నరేంద్ర మోదీని నేను కోరుతున్నా. పార్లమెంటులో ఒక ఎంపీ ఉన్న ప్రతి పార్టీని తప్పక ఆహ్వానించండి’ అని ఎక్స్ పోస్ట్‌లో కోరారు.
Regarding the Pahalgam All Party Meeting, I spoke to @KirenRijiju last night. He said they’re thinking of inviting only parties with “5 or 10 MPs.” When I asked why not parties with fewer MPs, he said that the meeting would get “too long.” When I asked “What about us, the smaller…
— Asaduddin Owaisi (@asadowaisi) April 24, 2025