న్యూఢిల్లీ: అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో వైమానిక రక్షణ వ్యవస్థను మోహరించారన్న వార్తల్ని భారత సైన్యం ఖండించింది. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన వెంటనే స్వర్ణదేవాలయాన్ని టార్గెట్ చేస్తూ పాకిస్థాన్ డ్రోన్, క్షిపణి దాడులకు దిగింది. దీనికి కౌంటర్‌గా భారత సైన్యం స్వర్ణదేవాలయంలో ఆయుధ వ్యవస్థను(ఎయిర్ డిఫెన్స్ గన్స్) ఏర్పాటుచేసిందన్న వదంతులు వ్యాపించాయి.
వీటిని ఖండిస్తూ భారత సైన్యం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్వర్ణ దేవాలయం ప్రధాన పూజారి గియానీ రఘుబీర్‌సింగ్ కూడా మీడియాలో వచ్చిన కథనాలను ఖండించారు. స్వర్ణదేవాలయం లోపల, ఆవరణలో ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు.