‘జనరిక్’ ఉత్తర్వులు నిలిపివేత: ఎన్ఎంసీ
వైద్యులు జనరిక్ ఔషధాలనే రాయాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఇటీవల జారీచేసిన నిబంధనలను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తాత్కాలికంగా నిలుపుదల చేసింది. జనరిక్ ఉత్తర్వులపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఇండియా ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) అసోసియేషన్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడింది.
న్యూఢిల్లీ: వైద్యులు జనరిక్ ఔషధాలనే రాయాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఇటీవల జారీచేసిన నిబంధనలను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తాత్కాలికంగా నిలుపుదల చేసింది. జనరిక్ ఉత్తర్వులపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఇండియా ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) అసోసియేషన్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడింది.
ఇక నుంచి డాక్టర్లందరూ రోగులకు విధిగా జనరిక్ మందులనే సిఫార్సు చేయాలని, దానిని పాటించని వారికి జరిమానాలు విధిస్తామని, అవసరమైతే వారి లైసెన్స్‌లను కూడా రద్దు చేస్తామంటూ ఈ నెల ప్రారంభంలో ఎన్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఫార్మా కంపెనీల నుంచి బహుమతులు స్వీకరించరాదని, ఏ ఔషధ బ్రాండులకూ ప్రచారం చేయరాదని స్పష్టంచేసింది. అయితే దీనిపై ఐఎంఏ, ఐపీఏ అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. నాణ్యమైన మందులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేంత వరకూ ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని కేంద్రాన్ని అభ్యర్థించాయి. అలాగే ఫార్మాకంపెనీలు స్పాన్సర్ చేసే సదస్సులకు హాజరుకాకుండా వైద్యులపై నిషేధం విధించే నిర్ణయాన్ని కూడా ఉపసంహరించాలని కోరాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

