న్యూఢిల్లీ : నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) 2026-27 విద్యా సంవత్సరానికి గాను అదనంగా 9,911 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1,36,939కి చేరింది. ఈ సీట్ల పెంపులో భాగంగా మొత్తం 823 వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ఏడాది 25 నూతన వైద్య కళాశాలలకు అనుమతులు లభించాయి.
రాష్ర్టాల వారీగా అదనంగా మంజూరైన ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య విషయానికి వస్తే.. కర్ణాటక-1,300, తమిళనాడు-950, రాజస్థాన్-900, పశ్చిమ బెంగాల్-825, తెలంగాణ-810, ఉత్తరప్రదేశ్-800, బీహార్-740, మధ్యప్రదేశ్-420, మహారాష్ట్ర-400, ఆంధ్రప్రదేశ్-375, జార్ఖండ్ 370గా ఉన్నాయి.