బెగుసరాయ్, డిసెంబర్ 25 : బీహార్ సీఎం నితీశ్‌కుమార్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌కు భారతరత్న ప్రకటించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సూచించారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీహార్ అభివృద్ధి కోసం నితీశ్ కృషి చేస్తున్నారని, నవీన్ పట్నాయక్ ఎన్నోఏండ్లు ఒడిశా అభివృద్ధి కోసం పనిచేశారని తెలిపారు. వీరిని భారతరత్నతో గౌరవించాలని కోరారు. నితీశ్ కుమార్ నాయకత్వంలో బీహార్‌లో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు.