Nirmala Sitaraman | ప్రభుత్వం 3-F ఫార్ములాపై దృష్టి సారించింది.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Nirmala Sitaraman | దేశంలో ఇంధన ధరలు (Fuel prices) పెరుగుతుండటంపై కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) స్పందించారు. పశ్చిమాసియా (West Asia) సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ దేశ ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉందని చెప్పారు. కానీ కొందరు పనిగట్టుకొని ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని అన్నారు. దేశం అంతర్జాతీయంగా సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ ఇలాంటి చర్యలు తగవని హితవు పలికారు.
Nirmala Sitaraman : దేశంలో ఇంధన ధరలు (Fuel prices) పెరుగుతుండటంపై కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) స్పందించారు. పశ్చిమాసియా (West Asia) సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ దేశ ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉందని చెప్పారు. కానీ కొందరు పనిగట్టుకొని ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని అన్నారు. దేశం అంతర్జాతీయంగా సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ ఇలాంటి చర్యలు తగవని హితవు పలికారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించాలని అంటున్నారని, కానీ అలాచేస్తే ప్రభుత్వం దాదాపు లక్ష కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతుందని తెలిపారు.
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 37వ వార్షికోత్సవంలో మాట్లాడిన మంత్రి నిర్మలా సీతారామన్.. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ దేశ ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉందని చెప్పారు. కానీ కొంతమంది అంతా మునిగిపోతోందనేలా భయాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాహుల్‌గాంధీ.. దేశ ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభం ఎదుర్కోబోతోందని హెచ్చరించారు. ఈ హెచ్చరికలకు నిర్మలాసీతారామన్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
పశ్చిమాసియా సంక్షోభం మొదలై మూడు నెలలు కావస్తున్న తరుణంలో ప్రభుత్వం ‘3-ఎఫ్’ (Fuel, Fertilizer, Forex – ఇంధనం, ఎరువులు, విదేశీ మారకం) పై ప్రత్యేక దృష్టి సారించిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతర్జాతీయ ఒత్తిళ్లవల్ల ఎరువుల ధరలు ఊహించని స్థాయికి చేరాయని, బంగారం ధరలు పెరగడం కూడా సవాలుగా మారిందని చెప్పారు. బయటి సంక్షోభాలను తట్టుకునేలా మోదీ నేతృత్వంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత సవాళ్లు అన్నీ అంతర్జాతీయ పరిస్థితులవల్ల వచ్చినవేనని, దేశీయంగా ఆర్థిక పరిస్థితి సానుకూలంగానే ఉందని చెప్పారు.
సామాన్య ప్రజలు సాధిస్తున్న విజయాలను మరిచిపోయి కొందరు కేవలం నెగటివిటీని ప్రచారం చేయడం సరికాదని మంత్రి అన్నారు. మన దేశం ఇలాంటి భయానక ప్రచారాలను భరించలేదని, మన మాటలు, చేతల ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

