న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: భారత్‌ని బయోఫార్మా తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 1,000 క్లినికల్ ట్రయల్ సైట్లను ఏర్పాటు చేసేందుకు, డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ సంస్థని బలోపేతం చేసేందుకు రానున్న ఐదేండ్లలో రూ.10,000 కోట్ల పెట్టుబడిని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం తన వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించారు. దేశంలో 1,000 అక్రెడిటెడ్ క్లినికల్ ట్రయల్ సైట్ల ఏర్పాటు ప్రణాళికను కూడా ఆర్థిక మంత్రి తన బడ్జెట్లో ప్రకటించారు.
భారత్‌లో వ్యాధుల భారం మధుమేహం, క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ రుగ్మతల వంటి అసాంక్రమిత వ్యాధుల వైపు మరలుతున్నట్లు ఆమె తెలిపారు.