న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ .. బడ్జెట్ ప్రసంగంలో ఇంగ్లీష్ పదాన్ని తప్పుగా పలికారు. దీంతో లోక్సభలో నవ్వులు పూశాయి. వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ గురించి ఆమె ప్రకటన చేస్తూ.. పాత కలుషిత వాహనాలను రిప్లేస్ చేస్తున్నామని చెప్పే సమయంలో.. ఓల్డ్ పొలిటికల్ అని పలికారు. ఆ తర్వాత వెంటనే సారీ చెబుతూ.. ఓల్డ్ పొల్యూటింగ్ వెహికిల్స్ అని తెలిపారు. అయితే పొల్యూటింగ్ పదం స్థానంలో పొలిటికల్ అని మంత్రి పలకడంతో విపక్ష సభ్యులు నవ్వేశారు.
వెహికిల్ రిప్లేస్మెంట్ పాలసీ అతిముఖ్యమైన విధానమి ఆమె తెలిపారు. ఇంగ్లీష్ పదాన్ని తప్పుగా పలికిన ఆమె తన పొరపాటును గుర్తించి చిరునవ్వు నవ్వారు. ఇక పొలిటికల్ పదం వాడిన సందర్భంలో పలుమార్లు పొల్యూటింగ్ పదాన్ని వినిపించారు. పర్యావరణ పరిరక్షణ విధానంలో భాగంగా వెహికిల్ స్క్రాపింగ్ విధానాన్ని చేపడుతున్నట్లు ఆమె చెప్పారు.
MPs laugh as FM Nirmala Sitharaman slips up, says 'political' instead of 'polluting'. #Budget2023 #BudgetWithEJ
Read: https://t.co/Bp1CoWd5xA pic.twitter.com/m2YwwFpg4O
— editorji (@editorji) February 1, 2023