పాలక్కాడ్: కేరళలో ‘నిఫా’ వైరస్‌తో రెండవ మరణం సంభవించిందన్న వార్తలు వెలువడుతున్నాయి. పాలక్కాడ్ జిల్లాలో గత శనివారం మరణించిన 57 ఏండ్ల ఓ వ్యక్తికి నిఫా వైరస్ సోకిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో కేరళ ప్రభుత్వం పాలక్కాడ్‌లో కాంట్రాక్ట్ ట్రేసింగ్, నిఘా కార్యకలాపాల్ని పెంచింది.
అతడి శాంపిల్స్ సేకరించి మంజేరి మెడికల్ కాలేజీలో పరీక్షలు చేయగా, నిఫా పాజిటివ్ అని తేలింది. దీనిపై పూర్తి నిర్ధారణ కోసం పుణె వైరాలజీ నుంచి నివేదిక కోసం ఎదురుచూస్తున్నదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి తెలిపారు.