తిరువనంతపురం, జూలై 5: కేరళలో ప్రమాదకర నిఫా వైరస్ తిరిగి ఆందోళన కలిగిస్తున్నది. ఈ వ్యాధి సోకి ఒక టీనేజర్ ఈ నెల 1న కోజీకోడ్లోని ఒక ప్రైవేట్ దవాఖానలో మరణించగా, మలప్పురానికి చెందిన 18 ఏండ్ల యువతి, పాలక్కాడ్కు చెందిన 39 ఏండ్ల మహిళకు ఈ వైరస్ సోకింది.
వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. పరీక్షల్లో వీరిద్దరికీ పాజిటివ్ వచ్చినట్టు పుణెకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజరీ (ఎన్ఐవీ) నిర్ధారించింది. కాగా, ఈ వ్యాధిని గుర్తించిన కోజికోడ్, మలప్పురం, పాలక్కడ్ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి అధికారులను ఆదేశించారు.