చెన్నై: తమిళనాడులోని శివకాశిలో బాణసంచా తయారు చేస్తుండగా గురువారం సంభవించిన పేలుడు వల్ల ఆరుగురు మహిళలు సహా, 9 మంది కార్మికులు మరణించారు. సుమారు 10 మంది గాయపడ్డారు. బాణసంచా నిల్వ ఉంచి ఏడు గదులు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద కారణం తెలియలేదు.