Covid-19 | కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్నది. ఇటీవల వరుసగా కేసులు నమోదవుతున్నాయి. కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ కేసులు నమోదయ్యాయి. అయితే, కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ తొమ్మిది నెలల చిన్నారికి కరోనా సోకినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. హొస్కోటే ప్రాంతానికి చెందిన ఈ చిన్నారిని ఆరోగ్య సమస్యలతో మొదట ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కలాసిపాల్యలోని వాణి విలాస్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
అక్కడ గురువారం కొవిడ్ పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలిందని కర్నాటక కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి హర్ష్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కర్నాటక పొరుగు రాష్ట్రమైన కేరళలో కేరళ భారీగా పెరుగుతున్నాయి. మే నెలలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 182 కొత్త కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ సూచించారు. జిల్లాల వారీగా చూస్తే, కొట్టాయం జిల్లాలో అత్యధికంగా 57 కేసులు నమోదగా.. ఎర్నాకుళంలో 34, తిరువనంతపురంలో 30 కేసులు వెలుగు చూశాయి.