కర్నాటకలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత.. బెంగుళూరులో స్కూళ్లు ఓపెన్

బెంగుళూరు: కర్నాటకలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూను ఎత్తివేయనున్నారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను అమలు చేసిన విషయం తెలిసిందే. ఇక స్కూళ్లను కూడా సోమవారం నుంచి తెరవనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి బీసీ నగేశ్ తెలిపారు. బెంగుళూరులో స్కూళ్లు ఓపెన్ అవుతాయని, అయితే కరోనా నిబంధనలు పాటించే విధంగా అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. మ్యారేజ్ వేడుకలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. ఇండోర్‌లో జరిగే పెళ్లి వేడుకలకు 200 మంది, ఔట్‌డోర్‌లో జరిగే వేడుకలకు 300 మందిని అనుమతించనున్నారు.
జిమ్‌లను 50 శాతం సామర్థ్యంతో తెరవనున్నారు. బార్లు, హోటళ్లను ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు నూరు శాతం ఉద్యోగులతో పనిచేయనున్నట్లు మంత్రి నరేశ్ తెలిపారు. ఆలయాల్లో పూజలకు కూడా అనుమతి ఇచ్చారు. అయితే ధర్నాలు, మతపరమైన, రాజకీయమైన కార్యక్రమాలకు మాత్రం అనుమతి ఇవ్వలేదని మంత్రి చెప్పారు. క్రీడా మైదానాలు, స్టేడియంల్లో 50 శాతానికి అనుమతి ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

