శ్రీనగర్: జమ్ము (Jammu) నగరంలో నానాటికి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో బుధవారం నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వెల్లడించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పారు.
‘కరోనా పాజిటివిటీ రేటును నిరోధించేందుకు నైట్ కర్ఫ్యూ విధించామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జమ్ము జిల్లా మెజిస్ట్రేట్ అన్షుల్ గార్గ్ హెచ్చరించారు. మహమ్మారి కట్టడికి ప్రజలంతా కరోనా టీకాలు తీసుకోవాలని సూచించారు. నైట్ కర్ఫ్యూ గురించి ప్రజల్లో ప్రచారం చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు.