Punjab | పడవలో స్కూల్‌కి వెళ్తున్న అమ్మాయిల వీడియో వైరల్.. పంజాబ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన ఎన్హెచ్ఆర్సీ
ఆడపిల్లల భద్రత అనేది రాష్త్ర ప్రభుత్వ బాధ్యత : జాతీయ మానవ హక్కుల సంఘం
స్కూల్‌కు వెళ్లడానికి ఇద్దరు అమ్మాయిలు పడవ సాయంతో సట్లెజ్ నది దాటితున్న వీడియో ఆన్లైన్లో వైరల్ కావడంతో జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) గురువారం పంజాబ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ ఇద్దరు అమ్మాయిలు ప్రాణాలు పణంగా పెడుతూ నది దాటుతున్న ఆ వీడియోను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా తీసుకుంది.‘సట్లెజ్ నది చుట్టుపక్కల గ్రామాల్లోని పిల్లలకు సరైన విద్యా వసతులు కొరవడ్డాయి. అమ్మాయిల భద్రత, వాళ్లను కాపాడడం అనేది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత’ అని పేర్కొంది. అంతేకాదు ఈ సంఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ఆ విద్యార్థులు సట్లెజ్ నది దాటకుండా దగ్గర్లో స్కూల్ ఏర్పాటు చేయడం లేదా ప్రభుత్వమే ఒక పడవని నడపడం వంటివి చేయాలని ఎన్హెచ్ఆర్సీ చెప్పింది.
ఈ వీడియోలో ఉన్న కరీనా కౌర్(12ఏళ్లు) కిర్నా రాణి (13 ఏళ్లు)లది ఫిరోజ్‌పూర్ పట్టణానికి దగ్గర్లోని కలువర గ్రామం. ఈ ఊరు భారతదేశం-పాకిస్థాన్ సరిహద్దులో ఉంటుంది. ఊరుకి మూడువైపులా సట్లెజ్ నది ప్రవహిస్తూ ఉంటుంది. నాలుగోవైపు పాకిస్థాన్ సరిహద్దు. ఇక్కడి విద్యార్థులు ఏడు నుంచి పదోతరగది చదవాలంటే పొరుగున ఉన్న గట్టి రాజొకే ఊరికి వెళ్లాలి. పడవలో కొంతదూరం వెళ్లి, అక్కడ నుంచి 4 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాలి. అందుకని ప్రమాదమని తెలిసిన ఈ ఇద్దరు అమ్మాయిలు పడవ సాయంతో సట్లెజ్ నది దాటేందుకు సాహసం చేశారు. ఈ గ్రామం నుంచి సట్లెజ్ నది దాటి సెకండరీ స్కూల్‌కి వెళ్తున్న మొదటి అమ్మాయిలు వీళ్లే.
WATCH: Kareena (12) and Kirna (13) ride a boat everyday, from their village on Zero Line of Indo-Pak border in Punjab, to reach a high school. Instead of dropping out after class 5 like other girls in village, these two opted this https://t.co/xtnhAwy2kW @iepunjab @IndianExpress pic.twitter.com/5YZ4PsdusU
— Divya Goyal (@divya5521) November 16, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

