ఉపాధ్యాయుడిని చితకబాదిన పోలీసులు.. బిహార్ సర్కారుకు NHRC నోటీసులు
NHRC | న్యూఢిల్లీ : బిహార్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) నోటీసులు జారీ చేసింది. కైమూర్ జిల్లాలో వృద్ధ ఉపాధ్యాయుడిని పోలీసులు చితకబాదిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ : బిహార్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) మంగళవారం నోటీసులు జారీ చేసింది. కైమూర్ జిల్లాలో వృద్ధ ఉపాధ్యాయుడిని పోలీసులు చితకబాదిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరు మహిళా పోలీసులు ఉపాధ్యాయుడిపై లాఠీలతో చితకబాదినట్లు ఆరోపణలున్నాయి. ఈ మేరకు బీహార్ చీఫ్ సెక్రెటరీతో పాటు డీజీపీకి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
బాధ్యులైన పోలీస్ సిబ్బందిపై నమోదైన ఎఫ్ఐఆర్తో పాటు తీసుకున్న చర్యలకు సంబంధించిన కాపీని సైతం జతచేయాలని, ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి గురించి సైతం తీసుకోవాలనుకుంటున్నట్లు కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. ఇదిలా ఉండగా.. గత శుక్రవారం కైమూర్ జిల్లా భభువాకు చెందిన కిశోర్ పాండే (65) అనే ఉపాధ్యాయుడు విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నారు. మండల్ జైలు సమీపంలో రోడ్డుపై ట్రాఫిక్ జామ్‌ను ఇద్దరు మహిళా పోలీసులు కంట్రోల్ చేస్తుండగా.. ఈ క్రమంలోనే వృద్ధ ఉపాధ్యాయుడు కాలినడకన రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు.
మహిళా పోలీసులు అతన్ని అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పోలీసులిద్దరూ వృద్ధ ఉపాధ్యాయుడిపై కర్రలతో దాడి చేశారు. పలువురు ఈ దృశ్యాలను సెల్ఫోన్లలో బంధించగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొని నోటీసులు జారీ చేసింది. పోలీసులు పరిధి దాటి వ్యవహరించారని, విధి నిర్వహణలో సంబంధం లేనివిధంగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bihar govt
- dgp
- NHRC
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pinarayi Vijayan | కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ సమన్లు.. మనీ లాండరింగ్ కేసులో అక్టోబర్ 23న విచారణ
విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
Donation | కొమురం భీమ్ విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ నాయకుడు విరాళం
IT Park | చౌటుప్పల్ ఐటీ పార్కులో భారీ పేలుడు.. వ్యక్తి మృతి
పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రాపోలు పరమేశ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

