న్యూఢిల్లీ, నవంబర్ 3: వచ్చే ఏడాది జనవరిలో జరిగే భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబవో సుబియాంటోను ఆహ్వానించనున్నారు. ఆయన పేరు నిర్ధారణ అయితే భారత గణతంత్ర వేడుకల్లో ఇండోనేషియా నేతలు పాల్గొనడం ఇది నాలుగోసారి అవుతుంది.
ఇండోనేషియా-భారత్ మధ్య ఆర్థిక, రక్షణ, సాంస్కృతిక రంగాల్లో పటిష్టమైన సంబంధాలు ఉన్నాయి.