న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ (PM Modi) శుభవార్త చెప్పారు. ఈసారి దీపావళి రెండింతల ఆనందాన్ని తీసుకురాబోతున్నది అంటూ.. వస్తు,సేవల పన్ను (GST) విధానంలో కొత్త తరం సంస్కరణలను తీసుకువస్తున్నామని వెల్లడించారు. సామాన్యులపై భారం తగ్గించేలా పన్నుల్లో భారీగా కోత పెట్టనున్నామని, ఈసారి దీపావళి కానుకగా ఇవ్వబోతున్నామని ఎర్రకోట వేదికగా ప్రకటించారు. ‘వెలుగుల పండుగ వచ్చేలోగా రాష్ట్రాలతో చర్చించి జీఎస్టీలో కీలకమైన మార్పులు, చేర్పులు చేస్తాం. సామాన్యులపై పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించి, భారీ ఉపశమనాన్ని కలిగించేలా తమ సంస్కరణలు ఉంటాయి. వీటివల్ల చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు, ఎంఎస్ఎంఈలకు భారీ ప్రయోజనం చేకూరుతుంది. జీఎస్టీ సంస్కరణల తర్వాత నిత్వావసర వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు ఉపశమనం కలుగుతుంది. అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది.
ప్రతి కుటుంబానికి ఉపశమనం కలిగించేలా నిత్యావసర వస్తువులపై విధించే పన్నును తగ్గిస్తున్నాం. వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించమే లక్ష్యంగా జీఎస్టీ స్లాబులను మార్పుచేస్తున్నాం. ఈ దీపావళి నాటికి సామాన్యుల జీవితాన్ని మరింత సులభతరం చేసేలా, సరళీకృత జీఎస్టీ విధానాన్ని మీరు చూస్తారు. హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి జీఎస్టీ సంస్కర్ణలు జరిపి ఈ దీపావళికి బహుమతిగా ఇస్తాం. సంస్కరణల విషయంలో ప్రతిఒక్కరు మాకు మద్దతు పలకాలి.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi says, “This Diwali, I am going to make it a double Diwali for you… Over the past eight years, we have undertaken a major reform in GST… We are bringing next-generation GST reforms. This will reduce the tax burden across the… pic.twitter.com/2hAPP0CFtH
— ANI (@ANI) August 15, 2025
అన్ని రంగాల్లోనూ సంస్కరణలు తెస్తున్నాం, ఈవిషయంలో వెనకడుగు వేసేది లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా దేశ హితం కోసమే. విధాన, నిర్మాణాత్మక, ఆర్థిక సంస్కరణల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. మార్పు అవసరమైన ప్రతిచోటా సంస్కరణలకు భారత్ సిద్ధంగా ఉంది. నగదు బదిలీ పథకం సామాన్య పేదలకు వరంగా మారింది. 25 కోట్ల మంది పేదలను దిగువ మధ్యతరగతి స్థాయికి తీసుకొచ్చింది. మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి సంయుక్త బలం భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నది. నైపుణ్యాభివృద్ధితో భారత యువత స్వయం ఉపాధి రంగాల్లో ముందడుగు వేస్తున్నది. ఎంతోమంది త్యాగధనుల వల్ల మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఇప్పుడు మనం స్వయం సమృద్ధిని సాధించాలి. స్వయం సమృద్ధి అనే పదాన్ని మన నరనరాల్లో జీర్ణించుకోవాలి. స్వదేశీ అనే పదం బలహీనత కాదు, అది మన బలంగా చాటిచెప్పాలి. నాణ్యత విషయంలో రాజీపడొద్దని వ్యాపారులను అర్థిస్తున్నా. నాణ్యత అనేది మన దేశ బ్రాండ్ కావాలి’ అని మోదీ అన్నారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi says, “… Hum bohot tezi se aage bandhna chahte hai. Main yeh desh ke liye kar raha hoon, mere liye nahi kar raha hoon. Kisi ka bura karne ke liye nahi kar raha hoon…”
He says, “Over the past decade, India has been reforming,… pic.twitter.com/vtd9tlN7tp
— ANI (@ANI) August 15, 2025