న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తమ సంస్థపై చేసిన ఆరోపణలు బోగస్ అని, అవి నిలబడవని ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘న్యూస్‌క్లిక్’ పేర్కొన్నది. స్వతంత్ర మీడియా నోరునొక్కేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించింది.
‘మా సంస్థకు చైనా లేదా చైనా సంస్థల నుంచి ఎలాంటి నిధులు లేదా ఆదేశాలు రాలేదు. మేం ఎప్పుడూ హింస, వేర్పాటువాదం, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడలేదు’ అని న్యూస్‌క్లిక్ పేర్కొన్నది.