బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 20:41:14

పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా 2291 కరోనా కేసులు

పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా 2291 కరోనా కేసులు

కోల్‌కతా : వెస్ట్‌ బెంగాల్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా అక్కడ నమోదవుతున్నకేసులు స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.  గడిచిన 24 గంటల్లో పశ్చిమ బెంగాల్‌లో 2291 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు 39 మరణాలు కూడా నమోదు కావడంతో మొత్తం మరణాల సంఖ్య 1221కి చేరింది. ఇదికాక రాష్ర్టంలో మొత్తం 49,321 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 18,450 కేసులు ప్రస్తుతం కరోనా సోకి దవాఖానలో చికిత్స పొందుతుండగా మిగతా కేసులు కోలుకొని డిశ్చార్జి అయ్యాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo