న్యూఢిల్లీ : సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు.. ఇలా కాలం కదిలిపోతూనే ఉన్నది. సూర్యోదయాలు, సూర్యస్తమయాలు ఒకదాని వెంట ఒకటి నిర్విరామంగా జరుగుతూ.. కాలం ఎవరి కోసం ఆగకుండా పరుగులు పెడుతూనే ఉన్నది. ఈ క్రమంలో ఒక్కో సంవత్సరం వరుసగా వచ్చిపోతున్నాయి.
ఇప్పటికే క్రీస్తు శకంలో 2024 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇవాళ్టితో 2025వ సంవత్సరం కూడా ముగిసిపోతున్నది. ఒక్కో దేశం వరుసగా కొత్త సంవత్సరంలో కాలుమోపుతున్నాయి. 2026వ సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతున్నాయి. ముందుగా న్యూజిలాండ్ నూతన సంవత్సరంలో అడుగుపెట్టింది. అక్కడి ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు.
ఇప్పుడు ఒక్కో దేశం క్రమంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాయి. మరికొన్ని గంటల్లో మనం కూడా న్యూఇయర్లోకి అడుగుపెట్టబోతున్నాం. ఇప్పటికే నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన దేశాల్లో సంబురాలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు..
#WATCH | New Zealand’s Auckland welcomes the #NewYear2026 with fireworks.
(Source: TVNZ via Reuters) pic.twitter.com/vybFTrAjeR
— ANI (@ANI) December 31, 2025