న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈసారి దేశాన్ని ముందుగానే పలకరించాయి. రైతులకు ఇది శుభవార్తే అయినప్పటికీ ము న్ముందు ఎక్కడ, ఎంత వర్షపాతం నమోదవుతుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ సూచనల కచ్చితత్వాన్ని పెంచేందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ రిజల్యూషన్ కలిగిన వాతావరణ నమూనా ‘భారత్ ఫోర్కాస్ట్ సిస్టం’ను భారత వాతావరణశాఖ (ఐఎండీ) ప్రారంభించింది. ఈ అధునాతన వాతావరణ నమూనా 6 కిలోమీటర్ల గ్రిడ్‌లో పనిచేస్తుంది. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యం త సూక్ష్మమైన వాతావరణ సూచనలను ఇది అందించగలదు. ముఖ్యంగా వ్యవసాయం, వరద నియంత్రణ, విమానయానం, మత్స్య పరిశ్రమ వంటి రంగాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వాతావరణ నమూనాను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం)
శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు.