Bargi Dam : మధ్యప్రదేశ్లోని నర్మదా నదిలో బార్గి డ్యామ్ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో తొమ్మిది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బోటు నిర్వాహకులు, సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి విడుదలైంది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులోని నిర్వాహకులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ఈ బోటు బయల్దేరడానికి ముందే వాతావరణ శాఖ అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఇలాంటి సమయంలో బోటు నదిలోకి వెళ్లకూడదు. అయితే, ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిర్వాహకులు బోటు తీశారు. ఈ అంశంలో నిర్లక్ష్యంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. పడవలో కూడా సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదు. సాధారణంగా లైఫ్ జాకెట్లు పడవ బయల్దేరడానికి ముందే ఇవ్వాలి. కానీ, ప్రమాదం జరగడానికి కొన్ని నిమిషాల ముందు ప్రయాణికులకు ఇచ్చారు. అప్పటికే బోటు ఊగడం, మునిగిపోవడం ప్రారంభించింది. ఈ సమయంలో లైఫ్ జాకెట్ల ప్యాకేజ్ విప్పి వాటిని ఇచ్చేందుకు ప్రయత్నించారు.
New video came out This is the height of negligence; in the #BargiDamaccident, life jackets were distributed only when the boat started sinking.#jabalpur #madhyapradesh #boataccident #bargidam pic.twitter.com/uFrIFB652u
— Siraj Noorani (@sirajnoorani) May 2, 2026
సేఫ్టీ డ్రిల్స్ కూడా నిర్వహించనట్లు తెలుస్తోంది. పడవ ప్రమాదాలు జరిగిన వెంటనే మొదటి నిమిషాలు చాలా కీలకం. కానీ, ఈ సమయంలోనే సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉంది. ఇలా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. ఈ పడవలో ఒక మహిళ తన బిడ్డను అదిమి పట్టుకుని ఉన్న దృశ్యం అక్కడి వీడియోలో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో ఇది.