Civils | న్యూఢిల్లీ, జనవరి 24 : సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలోనే అభ్యర్థులు తమ వయసు, రిజర్వేషన్‌కు సంబంధించిన పత్రాలను జతచేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రభుత్వ సర్వీసులో ఎంపికయ్యేందుకు మాజీ ఐఏఎస్ ప్రొబేషనర్ పూజా ఖేడ్కర్ ఓబీసీ సర్టిఫికెట్‌ను, వికలాంగ కోటా ప్రయోజనాలను దుర్వినియోగం చేయడంతోపాటు మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. దరఖాస్తు ఫారమ్‌తోపాటు జతచేయాల్సిన పత్రాలను అప్లోడ్ చేయని పక్షంలో దరఖాస్తు రద్దయిపోతుందని నిబంధనలు పేర్కొన్నాయి.
న్యూఢిల్లీ, జనవరి 24: దేశంలో పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్‌గా పేరొందిన ఎఫ్ఐఐటీజేఈఈ (ఫిట్జీ)ఉత్తర భారత ప్రాంతంలో సుమారు 8 కోచింగ్ సెంటర్లను అకస్మాత్తుగా మూసివేసింది. ఒక వైపు బోర్డు పరీక్షలు, మరో పక్క పోటీపరీక్షలు ముంచుకొస్తున్న వేళ చోటుచేసుకున్న ఈ హఠాత్ పరిణామంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇందులో పనిచేస్తున్న అధ్యాపకులు, సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదని, దాంతో వారు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది.